జులై 12 నుంచి 14 వరకు అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌

Telugu Lo Computer
0

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ జులై 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సమాచారాన్ని సేల్‌కు కొద్ది రోజులు ముందు అమెజాన్‌ రివీల్‌ చేస్తుంది. సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డులు, ఎస్‌బీ క్రెడిట్‌కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుందని అమెజాన్‌ వెల్లడించింది. ఆయా బ్యాంకుల ఈఎంఐ లావాదేవీలపైనా ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుంది. అమెజాన్‌ పే ఐసీఐసీఐ యూజర్లకు సేల్‌ సమయంలో 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు 5 శాతం అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, అమెజాన్‌ పే ద్వారా చెల్లింపులు చేసి విమాన టికెట్లపై 25 శాతం, హోటల్‌ బుకింగ్స్‌పై 50 శాతం, మూవీ టికెట్స్‌పై 100 శాతం వరకు డిస్కౌంట్‌ పొందొచ్చని పేర్కొంది. అమెజాన్‌ సేల్‌ కేవలం ప్రైమ్‌ మెంబర్ల కోసమే. సాధారణ యూజర్లు ఇందులో పాల్గొనడానికి లేదు. ప్రైమ్‌ మెంబర్లను పెంచుకోవడమే లక్ష్యంగా వారి కోసం ఎక్స్‌క్లూజివ్‌ ఆఫర్లను తీసుకొస్తుంటుంది. ప్రస్తుతం ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ వార్షిక ప్లాన్‌ రూ.1499గా ఉంది. ఇందులో పూర్తి షాపింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ బెన్‌ఫిట్స్‌ లభిస్తాయి. షాపింగ్‌ ప్రయోజనాలు, పరిమిత ప్రైమ్‌ వీడియో బెన్‌ఫిట్స్‌తో ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ రూ.799కు లభిస్తుంది. కేవలం షాపింగ్ ప్రయోజనాల కోసం రూ.399కే ప్రైమ్‌ షాపింగ్‌ ఎడిషన్‌ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ మూడింట్లో ఏదో ఒక ప్లాన్‌ ఉన్న వారు మాత్రమే ఈ సేల్‌లో పాల్గొనడానికి అర్హులు.

Post a Comment

0Comments

Post a Comment (0)