లాహోర్, కరాచీ విమానాశ్రయాలు మూసివేత

Telugu Lo Computer
0


పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ లో అతిపెద్ద నగరమైన లాహోర్‌లోని వాల్టన్ రోడ్‌లో గురువారం ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయని స్థానిక మీడియా వెల్లడించింది. లాహోర్‌ లో వరుస పేలుళ్లు సంభవించినట్లు పాకిస్తాన్‌ అధికారులు సైతం ధృవీకరించారు. దీంతో హై అలర్ట్ జారీ చేశారు. లాహోర్, కరాచీ ఎయిర్‌పోర్టును అధికారులు మూసివేశారు. పహల్గాం ఉగ్రదాడితో భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో పాకిస్థాన్ లో బాంబు పేలుళ్లు సంభవించడం కలకలం రేపింది.. గురువారం ఉదయం బాంబుల శబ్ధాలతో వణికిపోయినట్లు లాహార్‌లోని ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బీఎల్ఏ కూడా పాకిస్తాన్ కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే పాక్ సైన్యంపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పలువురు రేంజర్లు కూడా మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)