మే 12న శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ విడుదల

Telugu Lo Computer
0


శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ను మే 12న వర్చువల్ 'గెలాక్సీ అన్ ప్యాకెడ్' ఈవెంట్‌లో విడుదల చేయబోతోన్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. వినియోగదారుల అంచనాలకు మించి, మొబైల్ ఇండస్ట్రీకి కొత్త దిశగా ఈ డివైస్ నిలుస్తుందని కంపెనీ తాజా బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. ఈ స్లిమ్ డిజైన్ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ ప్రాథమిక కెమెరా అందించనున్నారు. ఇది ఇప్పటికే గెలాక్సీ S25 అల్ట్రాలో ఉన్న అధునాతన కెమెరా సెన్సార్ కావడం విశేషం. పోర్టబిలిటీకి తోడుగా ఫ్లాగ్‌షిప్ పనితీరు అందించడమే లక్ష్యంగా డిజైన్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)