విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ చేసే సమయాల్లో విండో షేడ్స్‌ను మూసి ఉంచాలి : డీజీసీఏ

Telugu Lo Computer
0


రక్షణ శాఖ వైమానిక స్థావరాల్లో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ చేసే సమయాల్లో విండో షేడ్స్‌ను మూసి ఉంచాలని వాణిజ్య విమానాలకు డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) తాజాగా కీలక సూచనలు చేసింది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ తో సరిహద్దు ఉన్న పశ్చిమ భారత స్థావరాల వద్ద ఈ సూచన తప్పక పాటించాలని కిటికీలను కవర్ చేసేందుకు వస్త్రం లేక మెటీరియల్‌ను తప్పక ఉంచాలని పేర్కొంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత 10 వేల అడుగుల ఎత్తుకు వెళ్లేంత వరకు విండో షేడ్స్ మూసే ఉంచాలని, అలాగే ల్యాండింగ్ సమయంలో 10 వేల అడుగుల లోపు కిందకు రాగానే విండో షేడ్స్ మూసివేయాలని పేర్కొంది. ఎమర్జెన్సీ కిటికీల దగ్గర మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని డీజీసీఏ తెలిపింది. పాకిస్తాన్ తో ఇటీవల ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. వైమానిక స్థావరాల్లో ఫోటోలు, వీడియోలు తీయవద్దన్న నిబంధన గురించి ప్రయాణికులకు తెలియజేయాలని సూచించింది. వాటిని ఉల్లంఘిస్తే ఎదుర్కోవాల్సిన చర్యల గురించి వెల్లడించాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ స్పష్టం చేసింది. లేహ్, శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోట్‌, ఆదంపుర్, చండీగఢ్, బఠిండా, జైసల్మేర్, నాల్, జోధ్‌పూర్‌,హిండన్, ఆగ్రా, కాన్పుర్, బరేలీ, మహారాజ్‌పూర్, గోరఖ్‌పూర్, భుజ్, లొహెగావ్, డాబోలిమ్, వైజాగ్‌లోని విమానాశ్రయాలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)