ప్రముఖ టీవి నటి దీపికా కాకర్‌కు క్యాన్సర్‌ !

Telugu Lo Computer
0


ప్రముఖ టీవి నటి దీపికా కాకర్‌ క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గత కొన్ని వారాలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న దీపికా, ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా, ఆమె కాలేయంలో టెన్నిస్ బాల్‌ పరిమాణంలో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తదుపరి పరీక్షల్లో ఇది స్టేజ్-2 మాలిగ్నెంట్ (క్యాన్సరస్) కణితిగా నిర్ధారణ అయింది. దీపికా తన పోస్ట్‌లో, "గత కొన్ని వారాలు మాకు చాలా కష్టంగా గడిచాయి. కడుపు పైభాగంలో నొప్పితో ఆస్పత్రికి వెళ్లగా, కాలేయంలో కణితి ఉన్నట్లు తెలిసింది. ఇది స్టేజ్-2 క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. ఈ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటాను. దేవుని అనుగ్రహంతో పాటు, నా అభిమానుల ఆశీర్వాదాలు, ప్రేమతో ఈ కష్టాన్ని అధిగమిస్తానని నమ్ముతున్నాను' అని దీపికా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీపికా త్వరగా కోలుకోవాలని నెటిజన్స్, సహ నటులు కామెంట్లు చేస్తూ, ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)