ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో సునీల్‌కుమార్ ప్రజాపతి (45) అనే వ్యక్తి కూరగాయలు విక్రయిస్తుంటారు. పని ముగించుకొని కొంచెం సేపు సేదతీరుదామని తన ఇంటి సమీపంలోని ఒక చెట్టు కింద నిద్రిస్తున్నాడు. సునీల్ అక్కడ ఉన్న విషయాన్ని గమనించని పారిశుద్ధ్య సిబ్బంది ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న కాలువ నుంచి తీసిన మట్టిని అతడిపై పోశారు. దీంతో ఊపిరాడక అతడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు అతడిని గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక, ఈ ఘటనకు కారణమైన పారిశుద్ధ్య సిబ్బందిపై చర్యలు తీసుకొంటామని మున్సిపల్ అధికారులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లో పారిశుద్ధ్య సిబ్బంది అలక్ష్యానికి వ్యక్తి బలి
May 24, 2025
0
Tags