విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని ఎస్ఎంఎస్ -2 మిషన్‌లో మంటలు ఎగసి పడుతున్నాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు భారీగా ఎగసి పడటంతో స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. కాగా నాలుగు రోజుల క్రితం కూడా స్టీల్ ప్లాంట్‌లో పెనుప్రమాదం తప్పింది. ఆదివారం బ్లాస్ట్ ఫర్నెస్ -2లో సుమారు 300 ట్రక్కుల లిక్విడ్ స్టీల్ నేలపాలైంది. లిక్విడ్ స్టీల్‌ను ఫర్నెస్ నుంచి టర్బో ల్యాడిల్ కార్‌లోకి నింపి, ఎస్ఎంఎస్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో టీఎల్సీకి రంధ్రం పడి లిక్విడ్ స్టీల్ కింద పడగా.. మంటలు చెలరేగి కేబుల్స్ కాలి, ట్రాక్ దెబ్బతింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)