కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు

Telugu Lo Computer
0


కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత రుణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్‌కు సంబంధించిన సమస్యలను భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలనేదే దీర్ఘకాల జాతీయ వైఖరి అని తెలిపారు. ఈ విధానంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని వదిలేయాలని తెలిపారు. ఈ సందర్భంగా భారత్-పాకిస్థాన్ మధ్య అణు యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను రణధీర్ జైస్వాల్ తోసిపుచ్చారు. అణు బెదిరింపులను ఏ మాత్రం సహించబోమని తేల్చి చెప్పారు. భారత్ నుంచి సైనిక చర్య పూర్తిగా సంప్రదాయ డొమైన్‌లోనే జరిగిందన్నారు. భారత్ అణు బ్లాక్‌మెయిల్‌కు లొంగదని తేల్చి చెప్పారు. అణు బెదిరింపుతో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తే.. ఏ మాత్రం సహించబోమన్నారు. పాకిస్థాన్ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేసినట్లు చెప్పారు

Post a Comment

0Comments

Post a Comment (0)