వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ల విచారణ నుండి తప్పుకున్న సీజేఏ

Telugu Lo Computer
0


సుప్రీంకోర్టులో వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ల విచారణ నుండి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తప్పుకున్నారు. ఆయన మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఈ సమయంలో ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్‌ చేయడం లేదా జారీ చేయాలనుకోవడం లేదని అన్నారు. వక్ఫ్‌ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను మే 15న తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్‌ బి.ఆర్‌.గవై ధర్మాసనం ఎదుట జాబితా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై వివరణాత్మక పరిశీలన అవసరమైనందున ఈ దశలో తాను ఎటువంటి తీర్పు లేదా ఉత్తర్వులు రిజర్వ్‌ చేయాల్సిన అవసరం లేదని విచారణ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జస్టిస్‌ గవైకి కొంత సమయం ఇవ్వాలని, మే 15కు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మే 5 వరకు వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోమని, సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌ మరియు బోర్డులో ఎలాంటి నియామకాలు చేయబోమని జస్టిస్‌ సంజయ్ కుమార్‌, జస్టిస్‌ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనానికి కేంద్రం తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)