విజయవాడ టు బెంగళూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు

Telugu Lo Computer
0


విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని త్వరలో వందేభారత్ రైలును నడపాలని  కేంద్ర రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ వందేభారత్ రైలు వల్ల సమయం కూడా ఆదా అవుతుంది అని రైల్వేశాఖ తెలిపింది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లడానికి కనీసం 12 నుంచి 13 గంటల సమయం పడుతోంది. అయితే వందే భారత్ రైలువల్ల అయితే 8 నుంచి 9 గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు చేరుకోవచ్చు. ఈ వందేభారత్ రైలు వయా తిరుపతి మీదుగా వెళ్తుంది. కాబట్టి తిరుపతి వెళ్లే ప్రయాణికులు కేవలం నాలుగున్నర గంటల్లోనే తిరుపతి చేరుకోవచ్చు. విజయవాడ - బెంగళూరు మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. షెడ్యూల్‌తో పాటు ప్రయాణ సమయం తొమ్మిది గంటలుగా రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ వందేభారత్ రైలు నడపటం వల్ల ప్రయాణికులు మూడు నుంచి 4 గంటలకు పైగా సమయం ఆదా అవుతుంది. ఈ వందే భారత్ రైలు వయా తిరుపతి నుంచి కావడంతో తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు కేవలం నాలుగున్నర గంటలలో తిరుపతి చేరుకునేలా ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. వారంలో 6 రోజులపాటు రాకపోకలుఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్‌కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ ఉండనున్నాయి. విజయవాడ - బెంగళూరు మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (20711) మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు రాకపోకలు సాగించనుంది. ఈ వందేభారత్ రైలు విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, కృష్ణరాజపురం మీదుగా బెంగళూరు వెళ్లేలా రూట్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ రైలు విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి 9.45, చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38, ఎస్‌ఎంవీటీ బెంగళూరు 14.15 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ రైలు (20712) బెంగళూరులో 14.45 గంటలకు ప్రారంభమై కృష్ణరాజపురం 14.58, కాట్పాడి 17.23, చిత్తూరు 17.49, తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడ 23.45 గంటలకు రానుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వారికి వారానికి 3 రోజులు నడిచే మచిలీపట్నం నుంచి యశ్వంతపూర్‌ వెళ్లే కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే అందుబాటులో ఉంది. దానికి విపరీతమైన రద్దీ ఉంది. అలాగే కోస్తాంధ్ర రాయలసీమ ప్రజలు బెంగళూరు, తిరుపతి ప్రయాణాలు అత్యధికంగా ఉండటంతో ఆ రద్దీని పరిగణలోకి తీసుకుని ఈ వందేభారత్ రైలు ప్రతిపాదనలు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)