బల్లులు నివారణకు చిట్కాలు !

Telugu Lo Computer
0


వంటింట్లో స్టౌ కింద, గోడల మీద ప్రతి చోట బల్లులు తిరుగుతూనే ఉంటాయి. అవి చూడటానికి చాలా చిరాగ్గా ఉంటుంది. కొన్ని చిట్కాలను పాటిస్తే బల్లులు ఇంటి నుంచి బయటకు తరిమేయవచ్చు. బల్లుల బెడద వదిలించుకోవటానికి గుడ్డు పెంకులు చాలా బాగా సహాయపడతాయి. గుడ్డు ఖాళీ పెంకును బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో పెడితే గుడ్డు పెంకు వాసనకు బల్లులు పారిపోతాయి. వెల్లుల్లి వాసన బల్లులు భరించలేవు. బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో వెల్లుల్లిపాయ వెల్లుల్లి సగానికి కట్ చేసి పెడితే వాటి వాసనకు బల్లులు పారిపోతాయి. అంతే కాకుండా ఇంటి కిటికీల దగ్గర పెడితే కూడా బల్లులు తగ్గుతాయి. కారం పొడిని నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి ఇంటి గోడలు మూలల్లో స్ప్రే చేస్తే బల్లులు పారిపోతాయి. బల్లులు బయటకు పోవాలంటే నెమలి ఈకలను పెట్టాలి. నెమలి ఈకలు బల్లులు వచ్చే ప్రదేశంలో పెడితే చాలు. ఎందుకంటే నెమళ్లు బల్లులను తింటాయి. అందుకే నెమలి ఈక వాసన చూసినా బల్లి పారిపోతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)