జంగారెడ్డి గూడెంలో మరణాలపై ముగ్గురు అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 2022 మార్చిలో కల్తీ మద్యం కారణంగా చోటు చేసుకున్న మరణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వం ముగ్గురు అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందానికి ఏలూరు ఎస్పీ కిశోర్‌ నేతృత్వంలో  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వేణు ప్రభుకుమార్‌, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం హెచ్‌వోడీ ప్రొఫెసర్‌ ఉమామహేశ్వరరావు సభ్యులుగా ఉంటారు. కల్తీ మద్యం కారణంగా చోటు చేసుకున్న మరణాలకు సంబంధించి జంగారెడ్డి గూడెం పోలీస్‌స్టేషన్‌లో నాలుగు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల పరిస్థితిపైనా అధ్యయనం చేయాలని టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరణాలపై లోతుగా అధ్యయనం చేసి, బాధ్యులెవరో గుర్తించాలని, సాంకేతికపరమైన సిఫార్సులు కూడా చేయాలని ఆదేశించింది. కల్తీ మద్యం కారణంగా దాదాపు 22 మంది అప్పట్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)