ఒక పరీక్ష మిమ్మల్ని ఎప్పటికీ నిర్వచించలేదు !

Telugu Lo Computer
0


సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది విద్యార్థుల దృఢసంకల్పం, క్రమశిక్షణ, కఠోర శ్రమకు దక్కిన ఫలితమన్నారు. ఈ పరీక్షల్లో విజయానికి దోహదం చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతరుల పాత్రను గుర్తుంచుకొనే రోజు కూడా ఇదేనని పేర్కొన్నారు. సీబీఎస్‌ఈ పరీక్షల ఫలితాలు విడుదలైన అనంతరం ఆయన 'ఎక్స్‌'లో పోస్టు పెట్టారు. మున్ముందు వచ్చే అన్ని అవకాశాల్లో పరీక్షా వారియర్లు గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా. ఇప్పుడు సాధించిన స్కోర్‌ల పట్ల కొంచెం నిరుత్సాహంగా ఉన్న వారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక్క పరీక్ష మిమ్మల్ని ఎప్పటికీ నిర్వచించలేదు. మీ ప్రయాణం ఇంకా చాలా పెద్దది. మీ బలాలు మార్కుల పట్టికను మించిపోతాయి. ఎన్నో గొప్ప విషయాలు ఎదురుచూస్తున్నందున మీరు విశ్వాసంతో ముందుకు సాగండి. కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఉత్సుకతతో ఉండండి'' అని సూచించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)