వాట్సాప్ “వాయిస్ చాట్” అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో గ్రూప్ సభ్యులు లైవ్ ఆడియోలో పరస్పరం మాట్లాడుకుంటూనే చాట్‌లో మెసేజ్‌లను కొనసాగించగలుగుతారు. ఇంతకు ముందు వాయిస్ చాట్ సదుపాయం 33 మందికి మాత్రమే అందుబాటులో ఉండగా, తాజాగా ఇదే ఫీచర్‌ను 256 మందికి విస్తరించారు. అంటే, ఒక గ్రూపులో ఉన్న ఏ సభ్యుడైనా వాయిస్ చాట్ ప్రారంభించవచ్చు. అయితే, ఈ చాట్ కాస్త భిన్నంగా ఉంటుంది. అంటే ఇతరులకు నోటిఫికేషన్ వెళ్లదు. కానీ, ఎవరైనా అవసరమైతే వాయిస్ చాట్‌లో చేరొచ్చు లేదా ఎప్పుడు కావాలన్నా వాయిస్ చాట్ నుండి వెళ్లొచ్చు. ఈ వాయిస్ చాట్ ప్రారంభించిన వెంటనే, అది గ్రూప్ చాట్ దిగువ భాగంలో కనిపిస్తుంది. ఇందులో ఎవరెవరు ఉన్నారో చూడొచ్చు. ఇది పూర్తిగా ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్‌తో పని చేస్తుంది. అలాగే సాధారణ వాట్సాప్ కాల్స్, మెసేజ్ లలానే గోప్యంగా ఉంటుంది. ఈ వాయిస్ చాట్ ఫీచర్ త్వరలోనే గ్లోబల్ స్థాయిలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులందరికీ లభ్యం కానుంది అని వాట్సాప్ ప్రకటించింది. ఇంతవరకూ గ్రూప్ కమ్యూనికేషన్‌లో మెసేజ్‌లకే పరిమితమైన వాట్సాప్, ఇప్పుడు ఈ వాయిస్ చాట్ ఫీచర్‌తో మరింత ఇంటరాక్టివ్‌గా మారనుంది.
వాట్సాప్ కొత్త ఫీచర్ “వాయిస్ చాట్” !
May 25, 2025
0
Tags