ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గజ్రాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ‘ఇండియన్ ఐడల్’ సీజన్ 12 విజేత పవన్ దీప్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఉత్తరాఖండ్ నుండి ఢిల్లీకి ప్రయాణిస్తుండగా వారి కారు ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక కంటైనర్‌ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో పవన్ దీప్‌తో పాటు ఆయన వెంట ఉన్న ఇద్దరు స్నేహితులకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు , పోలీసులు స్పందించి వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, వారి గాయాల తీవ్రత దృష్ట్యా మెరుగైన చికిత్స కోసం వెంటనే ఢిల్లీకి తరలించినట్లు అధికారులు తెలిపారు.
'ఇండియన్ ఐడల్' విజేత పవన్ దీప్‌కు రోడ్డు ప్రమాదం
May 05, 2025
0
Tags