జీజీయూ, ఐబీఎం కలిసి "ఫ్యూచర్ ఫార్వర్డ్" అకడమిక్ ప్రోగ్రామ్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టెక్నాలజీ ఆధారిత విద్యాభివృద్ధికి రాజమహేంద్రవరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) ఐబీఎం ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కలిసి "ఫ్యూచర్ ఫార్వర్డ్" అనే ఇండస్ట్రీ-అలైండ్ అకడమిక్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నది. మే 19, 2025న జీజీయూ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్స్‌లర్ డా. యు. చంద్ర శేఖర్, ప్రో వైస్ ఛాన్స్‌లర్ డా. కె. విజయ భాస్కర రాజు, ప్రో ఛాన్స్‌లర్ శ్రీ శశి కిరణ్ వర్మ, IBM ICE బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ క్లయింట్ రిలేషన్‌షిప్ లీడర్ శ్రీ హరి రామ సుబ్రహ్మణియన్, IBM ICE డెలివరీ హెడ్ శ్రీ వికార్ ఉద్దీన్ సూర్కీ, ది ఫన్నెల్ స్టోరీ ఫౌండర్ శ్రీ సుమంత్ పాల్గొన్నారు.ఈ భాగస్వామ్యం ద్వారా, "Artificial Intelligence & Machine Learning (AI & ML)" మరియు "Data Science" వంటి డిమాండ్ ఉన్న సాంకేతిక కోర్సులు విద్యార్థులకు అందించబడనున్నాయి. ఇవి పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు రూపొందించబడినవి కావున వాస్తవ జీవితంలో విజయవంతం కావడానికి సహాయపడతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)