భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపేలా క్రియాశీలక పాత్ర పోషించా !

Telugu Lo Computer
0


భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి తానే కారణం అని డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. యుద్ధాన్ని కొనసాగించితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని తాను హెచ్చరించానని, దీనితో ఈ రెండు దేశాలు కూడా యుద్ధ విరమణ ప్రకటించాయని ఆయన చెప్పుకొన్నారు. ఆయన సౌదీ అరేబియా పర్యటనలో కూడా ఇదే మాటను ప్రస్తావించారాయన. సౌదీ- యూఎస్ ఇన్వెస్టిమెంట్ ఫోరం సదస్సును ఉద్దేశించి చేసిన ప్రసంగంలోనూ భారత్- పాకిస్థాన్ యుద్ధం, పరస్పర దాడుల గురించి వివరించారు. యుద్ధం కంటే చర్చలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందనీ చెప్పుకొచ్చారు. యుద్ధ నివారణ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ వ్యాఖ్యలకు భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ దీన్ని ఆయన పెద్దగా పరిగణనలోకి తీసుకోనట్టుగానే కనిపించారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఇదే అంశాన్ని లేవనెత్తారు డొనాల్డ్ ట్రంప్. భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా తాను చర్యలు తీసుకున్నానని, ఇది చారిత్రాత్మక ఘట్టమని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ కుదుర్చుకోవడానికి వాణిజ్యాన్ని ఉపయోగించానని, దీనితో తన అభిప్రాయాలను అంగీకరించారని, ఏకీభవించారని ట్రంప్ వివరించారు. అమెరికా పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫొసాతో వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్ లో ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న దౌత్య, వాణిజ్య, ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడారు. పనిలో పనిగా భారత్ - పాక్ యుద్ధాన్ని కూడా లేవనెత్తారు. రెండు అణ్వస్త్ర దేశాలు భారత్- పాకిస్తాన్ మధ్య శత్రుత్వాన్ని రూపుమాపేలా, యుద్ధాన్ని ఆపేలా తాను క్రియాశీలక పాత్ర పోషించానని అన్నారు. ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి తన వ్యక్తిగత దౌత్యం, వాణిజ్య ఒప్పందాలను ప్రయోగించినట్లు తెలిపారు. "భారత్- పాకిస్తాన్ మధ్య తలెత్తిన యుద్ధాన్ని నివారించడానికి తాను ఏం చేశానో ఒకసారి పరిశీలించాలని సిరిల్ రమాఫొసాకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఇ వ్యవహారం మొత్తాన్నీ పరిష్కరించుకున్నామని వ్యాఖ్యానించారు. వాణిజ్య ఒప్పందాలు, కార్యకలాపాల ద్వారా పరిష్కరించుకున్నానని అన్నారు. త్వరలోనే భారత్, పాకిస్తాన్‌తో ఓ భారీ ఒప్పందం చేసుకుంటోన్నామని చెప్పారు. పరస్పరం యుద్ధానికి దిగడం, కాల్పులు జరుపుకోవడం అనేది.. చిట్టచివరి ప్రయత్నం మాత్రమే కావాలని తాము ముందు నుంచీ కోరుకుంటోన్నామని, ఇదే విషయాన్ని ఇతర దేశాలకూ తెలియజేశానని చెప్పారు. యుద్ధానికి దిగితే ఆ సమస్య మరింత జటిలమౌతుందని అన్నారు. అందుకే యుద్ధాన్ని నివారించడానికి తాను భారత్- పాకిస్తాన్ తో మాట్లాడానని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)