నటుడు ముకుల్ దేవ్ మృతి చెందారు. గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం విషమించడంతో కాసేపటి క్రితమే మరణించినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ముకుల్ దేవ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశాడు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా ముకుల్ దేవ్ కు మంచి క్రేజ్ ఉంది. రవితేజ నటించిన కృష్ణ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఏక్ నిరంజన్, కేడి అలాగే అదుర్స్ లాంటి సినిమాల్లో కనిపించాడు ముకుల్ దేవ్. నటుడు రాహుల్ దేవ్ సోదరుడే ఈ విలన్ ముకుల్ దేవ్. తల్లిదండ్రుల మరణంతో ముకుల్ దేవ్ కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నాడని చెబుతున్నారు.
నటుడు ముకుల్ దేవ్ మృతి
May 24, 2025
0
Tags