'నడిగర్ సంఘం' బిల్డింగ్ నిర్మాణం పూర్తైన వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇటీవల బిల్డింగ్ నిర్మాణం పూర్తైంది. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే పెళ్లి గురించి కూడా ప్రస్తావించారు.. 'త్వరలోనే పెళ్లి చేసుకుంటా. నా జీవిత భాగస్వామిని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పటికే పెళ్లి గురించి మా మధ్య చర్చలు జరుగుతున్నాయి. మాది ప్రేమ వివాహమే. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తా' అని అన్నారు. అయితే హీరోయిన్ సాయి ధన్సికతో ఆయన ప్రేమలో ఉన్నారని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నా జీవిత భాగస్వామి దొరికింది - త్వరలో పెళ్లి చేసుకుంటా : నటుడు విశాల్
May 19, 2025
0
Tags