దేశీయ మార్కెట్‌లోకి ఫ్రాన్స్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ అల్కాటెల్ వీ3 సిరీస్‌లో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లు వీ3 క్లాసిక్ 5జీ, వీ3 ప్రో 5జీ, వీ3 అల్ట్రా 5జీని విడుదల చేసింది. ఈ మూడు ఫోన్ల విక్రయాలు జూన్ 2 నుంచి ప్రారంభమవుతాయి. వీ3 క్లాసిక్ 5జీ లో 6.67 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేటు కలిగి ఉంటుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 15 ఔటాఫ్‌ది బాక్స్‌తో వస్తోంది. 50ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,200mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.12,999, 6జీబీ +128జీబీ వేరియంట్ ధర రూ.14,999. కాస్మిక్ గ్రే, హాలో వైట్ రంగుల్లో లభిస్తుంది. వీ3 ప్రో 5జీని 6.67 అంగుళాల హెచ్‌డీ+ NXTPAPER డిస్‌ప్లేతో తీసుకొచ్చారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 15తో పనిచేస్తుంది.50ఎంపీ కెమెరా, 5 ఎంపీ అల్ట్రా వైడ్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 5,010mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8జీబీ +256జీబీ వేరియంట్ ధర రూ.17,999. ఇది గ్రీన్, మెటాలిక్ గ్రే రంగుల్లో లభిస్తుంది. వీ3 అల్ట్రా 5జీ6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ NXTPAPER స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 15 ఔటాఫ్‌ది బాక్స్‌తో వస్తోంది.108 ఎంపీ ప్రధాన కెమెరా, 5 ఎంపీ అల్ట్రా వైడ్ షూటర్, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,010mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6జీబీ +128జీబీ వేరియంట్ ధర రూ.19,999, 8జీబీ +128జీబీ వేరియంట్ ధర రూ.21,999. ఇది షాంపైన్ గోల్డ్, హైపర్ బ్లూ, ఓషియన్ గ్రే రంగుల్లో లభిస్తుంది.
అల్కాటెల్ మూడు కొత్త ఫోన్ల విడుదల
May 27, 2025
0
Tags