ఉరసా సంస్థకు 99 పైసలకు ఎకరా భూమి ఇచ్చినట్టు జగన్ నిరూపిస్తే.. రాజీనామాకు తాను సిద్ధమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సవాల్ చేశారు. టీసీఎస్‌కు 99 పైసలకు ఇచ్చాం, ఉరసాకు మార్కెట్ ధరకే భూములు ఇచ్చామని తెలిపారు. విశాఖలో 5లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఇక విశాఖ నగరాన్ని అందుకోలేమన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తోందని వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణంలో జగన్ వైఖరి దొంగే.. దొంగ దొంగ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఇక పరిశ్రమలు వస్తాయే కానీ, ఒక్కటి కూడా బయటకు పోదని స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోవటానికి ఏపీలో ఇప్పుడు వైకాపా ప్రభుత్వం లేదన్నారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన అందరికీ పదవులు వస్తాయని, పదవులు రాలేదని నేతలు అలకబూనడం మానేయాలని హితవు పలికారు. తాను విద్యాశాఖ మంత్రి అయ్యాక ఏపీలో ఏ ఒక్క పాఠశాల కూడా మూసివేయలేదన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని వైకాపా నేతలు కళ్లు తెరిచి చూడాలన్నారు.
ఉరసాకు ఎకరం 99 పైసలకు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం !
May 27, 2025
0
Tags