తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా ఈ కార్యక్రమాలను ఆవిష్కరించారు. ఈ నెలాఖరు వరకు జరిగే మిస్ వరల్డ్ పోటీల కోసం అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీల ద్వారా హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అంతేకాక తెలంగాణ పర్యాటక రంగానికి కూడా ఈ పోటీలు ఎంతో ఉపయోగపడతాయి. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మిస్ వరల్డ్ వేడుకలకు హాజరయిన ముద్దుగుమ్మలు తెలంగాణ సంప్రదాయమైన నీరా కల్లును తాగారు. ప్రపంచ అందగత్తెలు తెలంగాణకు చెందిన ఈ తాటి కల్లును సేవించి వావ్ అన్నారు. దాని రుచికి ఫిదా అయ్యారు. తెలంగాణ కల్లు చాలా అద్భుతంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాటి కల్లు తాగిన మిస్ వరల్డ్ ముద్దుగుమ్మలు : వీడియో వైరల్
May 12, 2025
0
Tags