మీరు క్రీడాకారులు మాత్రమే కాదు, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ అంబాసిడర్లు

Telugu Lo Computer
0


బీహార్‌ తొలిసారిగా జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 సెవన్త్ ఎడిషన్‌ను ప్రధాన మంత్రి వర్చువల్ గా ఆదివారంనాడు ప్రారంభించారు. పాట్నాలో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో బీహార్ సీఎం నితీష్ కుమార్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ బీహార్‌ క్రీడా ప్రతిభను  ప్రశంసించారు. రాష్ట్రానికి చెందిన యంగ్ క్రికెటర్ సూర్యవంశీ ఆటతీరును హైలైట్ చేస్తూ, వైభవ్ విజయం వెనుక అతని అంకితభావం ఉందని, క్రీడాకారులు వివిధ స్థాయిలో ఎంత ఎక్కువగా ఆడితే అంతగా రాణిస్తారని అన్నారు. జాతీయ ఐక్యత, సాంస్కృతిక మార్పిడికి క్రీడలు దోహదం చేస్తాయని, బీహారేతరులు కూడా ఈ క్రీడల్లో పాల్గొని బీహార్ సమున్నత సంస్కృతిని, మధురమైన వంటకాలను ఆస్వాదించాలని అన్నారు. ''మీరు గ్రౌండ్‌లో క్రీడాకారులు మాత్రమే కాదు, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ అంబాసిడర్లు కూడా '' అని పేర్కొంటూ అధికారికంగా క్రీడలు ప్రారంభమైనట్టు ప్రధాని ప్రకటించారు. పాట్నా, భగలత్‌పూర్, రాజ్‌గిర్ సహా 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 6,000కు పైగా క్రీడాకారులు మే 15వ తేదీ వరకూ జరిగే ఈ మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)