పాకిస్తాన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్న బలుచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ

Telugu Lo Computer
0


లుచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ చేస్తున్న దాడులతో పాకిస్తాన్‌ అట్టుడుకుతోంది. భారత సైన్యంతో తలపడలేక సరిహద్దుల్లోని గ్రామాలపై దాడులు చేస్తూ సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుంది పాక్‌ సైన్యం. అయితే వారికి వారి దేశంలోని తిరుగుబాటు దాడులతో పెద్ద తలనొప్పిగా మారింది. బలుచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ పేరిట వేర్పాటువాదులు పాక్‌ సైనికులకు దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల పాకిస్తాన్‌ ఆర్మీని బలూచ్ లిబరేషన్‌ ఆర్మీ సాయుధులు తరుముతున్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. బలూచిస్తాన్‌లో 39 చోట్ల పాక్‌ ఆర్మీపై మెరుపుదాడులు చేసింది బీఎల్‌ఏ. ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని పోలీస్‌ స్టేషన్లను వాళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే బలూచ్‌ ప్రాంతంలోని హైవేలను బీఎల్‌ఏ నిర్బంధిస్తోంది. పాక్‌ ఆర్మీ ఇన్‌ఫార్మర్లను అరెస్ట్‌ చేస్తున్నారు. పాక్‌ బలగాలు కనిపిస్తేచాలు దాడులకు తెగబడుతున్నారు. పాక్‌ ఆర్మీ వాహనాలను వెంబడించి కాల్పులు జరిపిన వీడియో కూడా వైరల్‌ అవుతోంది. బలూచ్‌ మెరుపుదాడితో పాక్‌ జవాన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)