కూతురుని వేధిస్తున్న వ్యక్తికి దేహశుద్ధి చేసిన తల్లి : వీడియో వైరల్ !

Telugu Lo Computer
0

త్తర ప్రదేశ్‌లోని హమీపూర్ జిల్లా ముస్కారా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ వ్యక్తి కొంత కాలంగా అదే ప్రాంతానికి చెందిన బాలిక వెంటపడడం మొదలు పెట్టాడు. గత కొన్ని రోజులుగా ఆమెను వేధిస్తూ వస్తున్నాడు. వేధింపులు అధికమవడంతో ఆ బాలిక తన తల్లికి విషయాన్ని చెప్పింది. ఆ విషయం తెలిసిన తల్లి ఒక్కసారిగా ఆగ్రహంతో చెలరేగింది. తన కూతుర్ని వెంటబెట్టుకుని వెంటనే ఆ వ్యక్తి వద్దకు వెళ్లింది. తన కళ్లముందే కూతుర్ని ఇబ్బంది పెట్టిన వాడిని చూసిన ఆమె.. ఆ వ్యక్తిపై ఒక్కసారిగా దాడికి దిగింది. వెంటనే చెప్పు తీసి నడిరోడ్డుపైనే అతడిపై దాడి ప్రారంభించింది. 9 సెకన్లలో అతడిని 15 సార్లు చెప్పుతో కొట్టింది. తల్లికి కోపం చల్లపడలేదు. చెప్పుతో మొత్తం 23 సార్లు దాడి చేసి అతడిని గట్టిగా శిక్షించింది. ఆ మహిళ చెప్పుతో దాడి చేయగా ఆ వ్యక్తి అసహాయంగా అల్లాడిపోతూ విడిపెట్టమంటూ వేడుకున్నాడు. అయినా ఆమె వదల్లేదు. తల, ముఖం లక్ష్యంగా దాడి చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నడిరోడ్డుపైన ఇలా ఓ తల్లి చూపిన ధైర్యంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన కూతుర్ని రక్షించేందుకు ఓ తల్లి తీసుకున్న చొరవ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)