తెలంగాణలో కొందరు బీజేపీ నేతలు వ్యక్తిగత ఎజెండాలో పని చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత దూషనలకు దిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ కార్యాలయాన్ని వ్యక్తి గత అవసరాలకు వాడుకుంటే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ఆఫీసులో పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని సూచించారు. ఇక మీదట ప్రెస్ మీట్లు పెట్టాలంటే అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇది తనతో పాటు ప్రతీ ఒక్క నేతలకు వర్తిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ బాధ్యతగల పార్టీ నేతలు హూందాగా ప్రవర్తించాలని సూచించారు.
తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరిక
May 28, 2025
0
Tags