హైదరాబాద్‌లో ఈరోజు భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, మణికొండ, మెహిదీపట్నం, టోలిచౌకీ, మాసబ్‌ట్యాంక్, నాంపల్లిలో వర్షం పడింది. వర్షం కారణంగా ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక, ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజమాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
హైదరాబాద్‌లో భారీ వర్షం
May 26, 2025
0
Tags