తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని వేములవాడ-కోరుట్ల మెయిన్ రోడ్ పై సోమవారం సాయంత్రం బొల్లు రాజవ్వ (50) అనే మహిళను ఓ వ్యక్తి వేట కొడవలితో నరికి చంపాడు. హత్యానంతరం దర్జాగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. మహిళను హత్య చేశానని పోలీసుల ముందు నేరం అంగీకరించాడు. పెద్దమ్మ గుడి దగ్గర తల నరికి చంపేశానని ఎలాంటి భయం లేకుండా పోలీసులకు చెప్పాడు. నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు భూ వివాదాలే కారణమని స్థానికుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసిన వ్యక్తి గతంలో కూడా చందుర్తిలో ఓ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నట్లు సమాచారం.
మహిళను వేట కొడవలితో నరికి చంపి పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయిన నిందితుడు
May 27, 2025
0
Tags