ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 8 ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. గూగుల్ తయారు చేసిన అత్యుత్తమ ఫోన్లలో పిక్సెల్ 8 ఒకటి. ఇప్పుడు ఇది అసలు ధర కంటే చాలా తక్కువ ధరకు లభ్యమవుతోంది. గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ అసలు ధర రూ. 75,999 కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 40 శాతం డిస్కౌంట్ తో దీన్ని రూ. 44,999కి అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫోన్‌కి 24 నెలల వరకు ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. నెలకు కేవలం రూ. 1583 చెల్లించి ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక బ్యాంకుల క్రెడిట్ కార్డులపై అదనపు తగ్గింపు కూడా అందుతోంది. ఈ ఫోన్ 6.2 అంగుళాల Full HD+ OLED డిస్‌ప్లే, వేగవంతమైన పనితీరు అందించే గూగుల్ టెన్సర్ G3 ప్రాసెసర్, అద్భుతమైన ఫొటోలు తీసుకునేందుకు 50MP మెయిన్ కెమెరా, 10.5MP ఫ్రంట్ కెమెరా అందించబడుతాయి. నీటి, ధూళి నిరోధకత కోసం IP68 రేటింగ్, 4575mAh బ్యాటరీ ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ లో గూగుల్ పిక్సెల్ 8 ఫోన్‌పై భారీ తగ్గింపు
May 11, 2025
0
Tags