అంతర్జాతీయ ద్రవ్య నిధిసంస్థ పాకిస్తాన్ కు ఒక బిలియన్ యూఎస్ డాలర్లు సాయం ప్రకటించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది. ఐఎంఎఫ్ సాయాన్ని ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు పాకిస్తాన్ వాడుకుంటోందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ముందు లేవనెత్తింది. రుణాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఐఎంఎఫ్ లో పాకిస్తాన్ కు ఇచ్చే రుణంపై ఓటింగ్ ను భారత్ బహిష్కరించింది. ఇక పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఇదే విషయంపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఐఎంఎఫ్ తమకు 1 బిలియన్ యూఎస్ డాలర్లు అప్పు ఇచ్చిందని, మేము 7 బిలియన్ యూఎస్ డాలర్లు రుణం అడగ్గా.. మొదట 1 బిలియన్ యూఎస్ డాలర్లు ఇచ్చినట్లు పేర్కొంది. ఐఎంఎఫ్ నిర్ణయంపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ కు రూ.7,500 కోట్ల ఐఎంఎఫ్ రుణం మంజూరు
May 10, 2025
0
Tags