ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో పట్టపగలు ఒక మొబైల్ దుకాణ యజమాని నుంచి రూ. 50వేలను దొంగలు దోచుకున్న సంఘటన కలకలం రేపింది. మొబైల్ దుకాణ యజమాని కళ్ళలో కారం పొడి పోసి నగదుతో పారిపోయాడు. ఈ సంఘటన కెమెరాలో రికార్డైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి సాధారణ కస్టమర్‌గా నటిస్తూ సుహైల్ మొబైల్ దుకాణంలోకి ప్రవేశించినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ వ్యక్తి మొదట సుహైల్‌ను తన మొబైల్ ఫోన్‌ను రూ.19కి రీఛార్జ్ చేయమని అడిగాడు. మొత్తం సంఘటన సమయంలో అతను ముసుగు ధరించాడు. సుహైల్ రీఛార్జ్‌లలో బిజీగా ఉండగా, ఆ వ్యక్తి తన జాకెట్‌లో దాచిన కారం పొడిని బయటకు తీసి సుహైల్ కళ్ళలోకి కారం పొడి చల్లాడు. దీంతో సుహైల్ అల్లాడిపోయాడు. ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని, ఆ వ్యక్తి షాపులో నుంచి రూ.50 వేలను ఎత్తుకుని పారిపోయాడు. అతను డబ్బు లాక్కుంటుండగా సుహైల్ అతని చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
కళ్లల్లో కారం కొట్టి రూ.50 వేలు చోరీ !
May 01, 2025
0
Tags