మహిళల టీ20 ప్రపంచ కప్ తేదీలను ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌లో ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచ కప్ ఫైనల్ జులై 5న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 33 మ్యాచ్‌లు ఉంటాయి. ఇది 24 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సారి 12 జట్లు పాల్గొంటాయి. 2026లో ఇంగ్లాండ్‌లో జరగనున్నమహిళల టీ20 ప్రపంచ కప్ కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మే 1న లార్డ్స్ లో జరిగిన కార్యక్రమంలో వేదికలు, తేదీలను ప్రకటించారు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్, సౌతాంప్టన్‌లోని హాంప్‌షైర్ బౌల్, లీడ్స్‌లోని హెడింగ్లీ, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్, లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్, బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రాండ్ కూడా ఈ టోర్నమెంట్‌కు వేదికలుగా ఉంటాయి. భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాప్రికా, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రపంచ కప్ లో తమ స్థానాన్ని నిర్ధారించుకున్నాయి. మిగిలిన జట్లను వచ్చే ఏడాది జరిగే క్వాలిఫయర్స్ నుంచి ఎంపిక చేస్తారు. ఐసీసీ ఛైర్మన్ జైషా మాట్లాడుతూ.. "వేదిక నిర్ధారణ ఒక ముఖ్యమైన క్షణం. మనం 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ వైపు అడుగులు వేస్తున్నాం. ఈ టోర్నమెంట్ ప్రపంచంలోని అత్యుత్తమ కీడాకారిణులను ఒక చోట చేర్చుతుంది. ఇది నైపుణ్యం, క్రీడాస్ఫూర్తికి ఒక వేడుక అవుతుంది." అని అన్నారు.
మహిళల టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల
May 01, 2025
0
Tags