24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలు అమ్మి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించడం ద్వారా చారిత్రాత్మక రికార్డును సాధించినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. జనవరి 20, 2025న ఒక రోజులో 5.8 లక్షలకు పైగా ఎల్ఐసీ పాలసీలు అమ్ముడయ్యాయి. ఇది జీవిత బీమా రంగంలో ఒక మైలురాయిగా మారింది. ఈ గిన్నీస్ రికార్డు ద్వారా ఎల్ఐసీ తన పాత రికార్డును తనే బద్దలు కొట్టింది. ఒకే రోజులో 588,107 జీవిత బీమా పాలసీలు ఈ రోజు విక్రయంచారు. ఇవన్నీ దాని భారీ ఏజెన్సీ నెట్‌వర్క్ చేసిన కృషికి కారణంగా చెప్పుకోవచ్చు. దేశం అంతటా మొత్తం 4,52,839 మంది ఎల్ఐసీ ఏజెంట్లు ఈ అపూర్వమైన ఘనతను సాధించడానికి పరిపూర్ణ సమన్వయంతో పనిచేశారు. ఇది ప్రపంచంలో ఎక్కడైనా 24 గంటల్లో అమ్ముడైన అత్యధిక జీవిత బీమా పాలసీలుగా నిలిచిందని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా బలమైన, విస్తృతమైన ఏజెంట్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఈ సుశిక్షితులైన ఏజెంట్లు ఈ సంవత్సరం జనవరి 20న వారి జట్టుకృషి, అంకితభావంతో ఈ గిన్నీస్ రికార్డును సాధించడంలో ప్రధాన పాత్ర పోషించారని కంపెనీ తెలిపింది.
24 గంటల్లో 5.8 లక్షల పాలసీలు విక్రయం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఎల్ఐసీ
May 24, 2025
0
Tags