ఓటీటీ బెనిఫిట్స్ అందించే జియో రూ.100 రీఛార్జ్‌ ప్లాన్‌

Telugu Lo Computer
0


జియో రూ.100 ప్లాన్‌లో రూ.299 విలువైన ఓటీటీ బెనిఫిట్స్ అందించే ఒక కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ముఖ్యంగా మొబైల్ లేదా టీవీలో స్ట్రీమింగ్ కంటెంట్‌ను ఆస్వాదించే వినియోగదారుల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం డేటా 5 జీబీ మాత్రమే. జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లపై ఎక్కువ ఖర్చు చేయకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్ వంటి వాటిని ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది. 100 రూపాయల ప్లాన్ ద్వారా బెనిఫిట్స్ పొందాలంటే జియో నంబర్‌లో యాక్టివ్ బేస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుని ఉండాలి. బేస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకోకుండా రూ. 100 రీఛార్జ్ ద్వారా ప్రయోజనాలను పొందలేరు.

Post a Comment

0Comments

Post a Comment (0)