ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ డేస్ సేల్ లో మోటోరోలా G45 5G ఫోన్ పై డిస్కౌంట్ ను ప్రకటించింది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14999కు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి 13శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్ తర్వాత రూ. 12999కు సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ కింద కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అంతేకాదు.. రూ.12450 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. కండీషన్స్ అప్లయ్ అవుతాయి. అప్పుడు మాత్రమే ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2167 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు. 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే, రిజల్యూషన్ 720×1600 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 చిప్‌సెట్, 8GB RAM, 128GB స్టోరేజ్, ఫోటోగ్రఫీకి 50MP ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ సైడ్ సెల్ఫీలకు 16MP కెమెరా కలిగి వుంది.
బిగ్ బచత్ డేస్ సేల్ లో మోటోరోలా G45 5G ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ !
April 04, 2025
0
Tags