చిట్టి పికిల్స్ అలేఖ్య తాజాగా ఐసీయూలో చేరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను అలేఖ్య సోదరి సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో చేసే ట్రోలింగ్ తట్టుకోలేక అలేఖ్య ఆరోగ్య పరిస్థితి దారుణంగా తయారైందని, అందుకే ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించింది. ఆక్సిజన్ తీసుకునే పరిస్థితిలో కూడా తన సోదరి అలేఖ్య లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకనైనా తమ ఫ్యామిలీ పైన ట్రోలింగ్ ఆపండి అంటూ వేడుకుంది. మూడు నెలల కిందటే తమ తండ్రి మరణించాడని, మా ఇంట్లో మరో చావు చూడకూడదని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. తమకు పచ్చళ్ళ వ్యాపారం, యూట్యూబ్ వద్దంటూ పేర్కొన్నారు. ఇక ఈ వీడియోలో అలేఖ్య ఐసీయూ బెడ్ పైన ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది.
ఐసీయూలో అలేఖ్య : వీడియో వైరల్ !
April 08, 2025
0
Tags