తమిళనాడును నీట్‌ పరీక్ష నుంచి మినహాయించాలన్న అభ్యర్థనను తిరస్కరించిన రాష్ట్రపతి !

Telugu Lo Computer
0


వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పరీక్ష నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు చేసిన అభ్యర్థనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ శుక్రవారం జరిగిన అసెంబ్లీలో ప్రకటించారు. నీట్‌ నగర విద్యార్థులకు, ధనవంతులకు మాత్రమేనని, పేద విద్యార్థుల కలలకు దూరమని, సామాజిక న్యాయానికి విరుద్ధమని స్టాలిన్‌ ఈ సందర్భంగా అన్నారు. ఈ విషయంపై కేంద్రం తమ అభ్యర్థనను తిరస్కరించినా.. తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి దీనిపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. నీట్‌పై స్టాలిన్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ నీట్‌ పరీక్ష అమల్లోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులు వైద్య విద్యనభ్యసించాలనే కలలు నెరవేరవు. వారు కోచింగ్‌కి వెళ్లలేరు. ఈ నీట్‌ పరీక్ష గ్రామాల్లోని వైద్య సేవను ప్రభావితం చేస్తుంది. ఈ నీట్‌ పరీక్ష కేవలం నగర విద్యార్థులకు, ధనవంతులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధం. ఈ పరీక్షపై తమిళనాడు ప్రజలు, రాజకీయ పార్టీలు, విద్యార్థులు అందరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. ఈ అంశంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి.. ఈ పరీక్షకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపితే.. అన్ని అభ్యర్థనలను కేంద్రం రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నీట్‌ పరీక్ష వల్ల వైద్యవిద్యను చదవలేక చాలా మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు నీట్‌ను రద్దు చేసి.. ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల ఆధారంగా విద్యార్థులను వైద్యవైద్యకు అనుమతించాలని తమిళనాడు తీర్మానించింది. ఈ సమస్యపై సమీక్షించడానికి ప్రభుత్వం ఎ.కె రాజన్‌ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు అసెంబ్లీ నీట్‌కు వ్యతిరేకంగా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత ఈ అభ్యర్థనను కేంద్రానికి పంపింది. అయితే 2022 ఫిబ్రవరి 5న కేంద్రం ఈ అభ్యర్థనను తిరస్కరించింది. మరోసారి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి.. నీట్‌కి వ్యతిరేకంగా ఫిబ్రవరి 8 20022న అసెంబ్లీలోని బిల్లును ఆమోదించింది. 2002 నుంచి కేంద్రం అమలు చేస్తున్న ఈ పరీక్షా విధానంపై తమిళనాడు వ్యతిరేకిస్తూనే వస్తోంది. తమిళనాడు అభ్యర్థనను రాష్ట్రపతి ఆమోదించకపోవడం పట్ల స్టాలిన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ చర్యను ప్రజాస్వామ్య సమాఖ్య వ్యవస్థలో నల్లని పేజీగా ఆయన అభివర్ణించారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రజల్ని అగౌరవపరిచిందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోదు. ఈ చర్యలను ప్రజలను గమనిస్తున్నారు. కేంద్రం తమ అభ్యర్థనను తిరస్కరించి ఉండవచ్చు కానీ నీట్‌ పరీక్షపై తమ పోరాటం ఆగదు అని స్టాలిన్‌ చెప్పారు. నీట్‌పై న్యాయ నిపుణులను సంప్రదించి కోర్టులో దీనిపై సవాల్‌ చేస్తామని ఆయన ప్రకటించారు. దీనిపై ఏప్రిల్‌ 9న సచివాలయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి రాజకీయ పార్టీల నేతలు హాజరుకావాలని ఆయన కోరారు. తల్లిదండ్రులు, విద్యార్థుల కోరికల్ని నెరవేర్చేందుకు తమిళనాడు ప్రభుత్వం అన్నివిధాల ప్రయత్నాలు చేస్తుందని స్టాలిన్‌ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)