కండక్టర్ అమీన్ అహ్మద్ అన్సారీ త్వరలో వేరే డిపార్ట్ మెంట్ కు బదిలీ !

Telugu Lo Computer
0


టీఎస్ ఆర్టీసీ బస్సులో కండక్టర్ అమీన్ అహ్మద్ అన్సారీ తన ఎత్తు కారణంగా డ్యూటీలో ఇబ్బందులు ఎదుర్కొంటూ మెడ, వెన్నునొప్పి, నిద్రలేమితో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. బస్సుల్లో రోజూ సగటున ఐదు ట్రిప్పుల్లో 10గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోందని అహ్మద్ అన్సారీ వాపోయిన సంగతి తెలిసిందే. అయితే అహ్మద్ అన్సారీ సమస్యపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందని, అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు సూచించామని తెలిపారు. త్వరలోనే సజ్జనార్ అహ్మద్ అన్సారీకి వేరే డిపార్ట్ మెంట్ కు బదిలీ చేస్తారని మంత్రి పొన్నం వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)