ఆంధ్రప్రదేశ్ లో మే నెల నుంచి స్మార్ట్‌ రేషన్‌కార్డులు : మంత్రి నాదెండ్ల మనోహర్‌

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌  తెలిపారు. కొత్త రేషన్‌కార్డులో క్యూఆర్‌ కోడ్‌, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని వెల్లడించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్‌ కార్డులకు ఆప్షన్లు ఇస్తామన్నారు. ఈ-కేవైసీ పూర్తయితే ఎంతమందికి కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని చెప్పారు. మంగళవారం నుంచే దీపం-2 రెండోవిడత సిలిండర్‌ బుకింగ్‌ ప్రారంభమైందన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. నచ్చిన మిల్లుకు తీసుకెళ్లి రైతులు ధాన్యం విక్రయించుకోవచ్చని చెప్పారు. వాట్సప్‌ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించినట్లు వెల్లడించారు. వాట్సప్‌ ద్వారా 16వేల మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు తెలిపారు. రైతులకు గన్నీ బ్యాగ్స్‌ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)