ఇద్దరు యువతులు అడవికి సరదాగా వెళ్లి, సరస్సు ముంద ఒక యువతి నిలబడి సెల్పీలకు ఫోజులిచ్చింది. మరోయువతి ఫోటోలు తీస్తుంది. మరో యువతి చూస్తుండగానే ఇతంలో సరస్సులో నుంచి భారీ మొసలి పైకి వచ్చి యువతిని గుటుక్కున మింగేసి నీళ్లలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనతో షాకింగ్ కు గురైన యువతి కాపాడలంటూ భయంతో అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇద్దరు యువతులు కొత్త ప్రదేశాల్లోకి వెళ్తే పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోను క్రియేట్ చేసినట్లు సమాచారం. చాలా మంది కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించకూడదని అవగాహన కలిగిస్తూ ఈ వీడియోను రూపొందించినట్లు తెలుస్తోంది.
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా : యువతిని మింగిన మొసలి
April 01, 2025
0
Tags