భారత దేశంలోని యువత ఎక్కువగా ప్రయాణాలు చేయాలని, పేదలు నివసించే ప్రదేశాలను ఒకసారి పరిశీలించాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కోరారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచంలోనే భారత్ టాలెంట్ హబ్‌గా ఎందుకు మారుతోందని ప్రశ్నపై బిల్‌గేట్స్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''భారతీయులు గొప్ప ప్రతిభావంతులు. సులభంగా సమస్యలను పరిష్కరిస్తారు. వారి ఆవిష్కరణలను చూస్తే ఈ విషయం అవగతమవుతుంది. డిజిటల్ రంగంలోనూ భారత్ దూసుకెళుతోంది. 'ఆధార్' లాంటి సంబంధిత కార్యక్రమాలు అందుకు అద్దం పడుతున్నాయి'' అంటూ ఆయన ప్రశంసించారు. ''భారత్‌లోని యువకులు ఎక్కువగా ప్రయాణాలు చేయాలి. పేదలు నివసించే ప్రాంతాలను ఒకసారి పరిశీలించండి. అక్కడి వారు ఎంతో తెలివైనవారు. కానీ, వారికి అవకాశాలు తక్కువ. మంచి విద్య అందడం లేదు. వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీటిని యువత గమనించాలి'' అని సూచించారు.
భారత యువత పేదలు నివసించే ప్రదేశాలను ఒకసారి పరిశీలించాలి !
April 07, 2025
0
Tags