విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్ ?

Telugu Lo Computer
0

మేరీ కోమ్, తన భర్త ఓన్లర్ కరుంగ్ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంట. ఇప్పటికే ఈ జంట విడివిడిగా ఉంటున్నారని సమాచారం. 20 ఏళ్ల బంధానికి త్వరలోనే ముగింపు పలుకబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు విడాకులు ప్రక్రియ మొదలు పెట్టలేదని, త్వరలోనే ఆ ప్రాసెస్ ప్రారంభం కానుందని సమాచారం. 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఈ దంపతుల మధ్య విబేధాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మేరీ కోమ్ భర్త.. ఓన్లర్ 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. దాంతో ఆర్థికపరంగా భారీగా నష్టం వాటిల్లిందని సమాచారం. ఇది కాస్త దంపతుల మధ్య విభేదాలు సృష్టించిందని, అప్పటి నుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాక ప్రస్తుతం మేరీ కోమ్, ఆమె నలుగురు పిల్లలు ఫరీదాబాద్‌లో ఉండగా.. బాక్సర్ భర్త మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ఉంటున్నారని తెలుస్తోంది. అయితే మేరీ కోమ్‌కు సంబంధించి ఆంగ్ల మీడియాలో సంచలన వార్తలు వస్తున్నాయి. మేరీ కోమ్ తన భర్త నుంచి విడిపోయిన తర్వాత.. ఆమె బిజినెస్ పార్ట్నర్‌ హితేష్ చౌదరీతో ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఈ హితేష్ చౌదరీమరో బాక్సర్ భర్త అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇతడు మేరీ కోమ్ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తోన్న తరుణంలో.. హితేష్ తన సోషల్ మీడియాలో మేరీ కోమ్ ఫొటోలు పోస్ట్ చేస్తూ.. వాటికి బలం చేకూరుస్తున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)