భారీ బడ్జెట్ తో కుబేర ?

Telugu Lo Computer
0


ర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో ధనుష్ కాంబోలో రూపొందుతున్న కుబేర సినిమా ఇద్దరు కెరీర్‌ల్లోను హైయెస్ట్ బడ్జెట్ సినిమా. దీనిని రు. 130 కోట్లతో తీస్తున్నారు.  తమిళ్ ఆర్టిస్ట్‌పై తెలుగు సినిమా ఈ రేంజ్ బడ్జెట్ పెట్టడం అంటే సినిమా కంటెంట్ పై ఆడియన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది. అయితే.. ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది అంటే కేవలం రెమ్యూనరేషన్ లెక్కలే. దాదాపు రూ.60 కోట్ల వరకు అయిపోతున్నాయట. నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్లకు కలిపి ఇంత ఖర్చవుతుందని.. ముఖ్యంగా ధనుష్ రెమ్యునరేషనే రూ.30 కోట్లని సమాచారం. నాగర్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున కూడా ఈ సినిమా కోసం కెరీర్‌లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్‌ను ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ పాత్రకు కచ్చితంగా నాగర్జున కావాలి కనుక.. ఆయన అడిగినంత ఇచ్చేసారట మేకర్స్. దాదాపు నాగ్ రూ. 14 కోట్ల రెమ్యురేషన్ ఛార్జ్ చేసినట్లు సమాచారం. ఇక రష్మిక హీరోయిన్గా, డిఎస్పి సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్న క్రమంలో.. ఒక్కొక్కటిగా సినిమా ఖర్చులన్నీ మరింతగా పెరుగుతూ వచ్చాయి. శేఖర్ కమ్ముల తీసుకున్న ఈ సబ్జెక్టును బ్యాంకాక్‌, ముంబైలలో అధిక భాగం షూట్ చేయాల్సి వచ్చిందని.. ఎక్కువ రోజులు అక్కడే వర్క్ చేయాల్సి వచ్చిందని.. ఈ క్రమంలోనే ఖర్చులు, వడ్డీలు కూడా అధికంగా అయినట్లు సమాచారం. అలా మొత్తం కలిపి రూ.130 కోట్ల వరకు బడ్జెట్ అయిందట. ఇదిలా ఉంటే.. సినిమా జస్ట్ ఓటీటీ హిందీ హక్కులతోనే రూ.90 కోట్ల వరకు రికవరీ చేసేసుకుందని తెలుస్తుంది. ఇక అసలైన వెర్షన్‌ తమిళ్.. ఈ హక్కులు ఇంకా అమ్ముడుపోలేదు. దాంతోపాటే థియేటర్ హక్కుల సైతం మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమా ఎంత లేదన్న కచ్చితంగా లాభాలు కొల్లగొడుతుందని.. కుబేర ఓ ప్రాఫిటబుల్ వెంచర్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)