తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే.రామకృష్ణారావు నియమితులుకానున్నారు. 1990 బ్యాచ్ ఐఏఎస్‌కు చెందిన రామకృష్ణారావు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామకృష్ణారావు వచ్చే ఆగస్టులో రిటైర్‌కానున్నారు. ప్రస్తుతమున్న ఐఏఎస్‌ల్లో శశాంక్‌గోయల్ తరువాత సీనియర్‌గా రామకృష్ణారావు ఉన్నారు. ఆర్థిక శాఖలో ఆయన చేసిన సేవలు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ఆయనకున్న అనుభవం తోడ్పడుతుందని ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆయనను సీఎస్‌గా నియమించాలనే ఆలోచన చేసినట్లుగా సమాచారం. రామకృష్ణారావు గతంలో నల్గొండ జాయింట్కలెక్టర్గా, గుంటూరు కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుత సీఎస్శాంతి కుమారి తన సర్వీసుకు వీఆర్‌ఎస్ తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది. ఆమె వీఆర్ఎస్ నిర్ణయాన్ని వచ్చేవారం ప్రకటించనున్నట్లుగా సమాచారం. దీంతో కొత్త సీఎస్‌గా రామకృష్ణారావును నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం. వాస్తవంగా శాంతి కుమారి ఈనెలఖరున పదవీ విరమణ చేయనున్నారు. అంత కంటే ముందుగానే ఆమె వీఆర్ఎస్తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలిసింది.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే.రామకృష్ణారావు ?
April 05, 2025
0
Tags