వాతావరణం అనుకూలించకపోవడంతో ఉగ్రదాడి వాయిదా ?

Telugu Lo Computer
0


గ్రవాదులు పక్కా ప్రణాళికతో బైసరన్‌ వ్యాలీలో దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తెలిసింది. వారు ఏప్రిల్‌ మొదటివారంలోనే ఈ లోయను సందర్శించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకొన్నట్లు తెలిసింది. ఆ తర్వాత మరో వారం పాటు కూడా ఆ ప్రదేశాల్లోనే ఉగ్రవాదులు తిరిగి సమాచారం సేకరించుకొని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో చాలా హోటళ్లలో సీసీ కెమెరాలను దర్యాప్తు సంస్థలు తనిఖీ చేస్తున్నాయి. వాస్తవానికి ఏప్రిల్‌ 22 కంటే రెండ్రోజుల ముందే అక్కడ ఈ దాడి జరగాల్సింది. కానీ, నాడు వాతావరణం అనుకూలించకపోవడంతో ఉగ్రదాడి వాయిదా పడింది. 20వ తేదీన అక్కడ భారీ వర్షం కురిసింది. ఈనేపథ్యంలో చాలామంది పర్యాటకులు పహల్గాం సందర్శన వాయిదా వేసుకొన్నారు. ఇక దాడి జరిగిన రోజు వాతావరణం సాధారణ స్థితికి చేరుకొంది. ఈనేపథ్యంలో నాడు దాదాపు 5,000 మంది పర్యాటకులు బైసరన్‌కు వచ్చినట్లు రవూఫ్‌ వనీ అనే గుర్రపుస్వారీ ఆపరేటర్‌ వెల్లడించారు. ఏప్రిల్‌ 22న ఇద్దరు ఉగ్రవాదులు బైసరన్‌ లోయలోని ఓ ఫుడ్‌స్టాల్‌ వద్ద కూర్చొని ఓపిగ్గా పర్యాటకుల సంఖ్య పెరిగేవరకు ఎదురుచూశారు. పెద్దసంఖ్యలో టూరిస్టులు వచ్చారని నిర్ధరణ చేసుకొన్న తర్వాత వారు షాపుల్లోకి వెళ్లి అక్కడున్నవారి మతం అడిగి నలుగురిని కాల్చేశారు. వారు విచక్షణారహితంగా కాల్పులు జరపలేదని ఎన్‌ఐఏ భావిస్తోంది. బాధితుల తలను గురి చూసి కాల్పులు జరిపినట్లు చెబుతోంది. ఇక ఉగ్రవాదులు ఫుడ్‌ స్టాల్‌ వద్ద మరెవరైనా సిగ్నల్‌ కోసం ఎదురుచూశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టింది. పహల్గామ్‌లోని బైసరన్‌ లోయలో జిప్‌లైన్‌ నిర్వాహకుడి శైలి అనుమానాస్పదంగా ఉండటంతో జాతీయ దర్యాప్తుసంస్థ అతడికి సమన్లు జారీ చేసినట్లు సమాచారం. రిషిభట్‌ అనే సందర్శకుడు జిప్‌లైన్‌పై ప్రయాణించేందుకు ఎక్కగానే కాల్పులు మొదలయ్యాయి. ఈ సమయంలో అతడు సందర్శకుడిని హెచ్చరించడం మానేసి 'అల్లాహో అక్బర్‌' అంటూనే.. ఉగ్రదాడి జరుగుతున్న వైపునకు రిషిని వదిలేశాడు. ఇదేమీ తెలియని అతడు ఉల్లాసంగా అరుస్తూ సెల్ఫీవీడియో తీసుకొన్నాడు. దీనిలో తన కాళ్ల కిందే ఉగ్రదాడి జరుగుతున్న విషయం కూడా అతడికి ఆ వేగంలో అర్థం కాలేదు. వాస్తవానికి ఉగ్రదాడి సమయంలో అక్కడ ఉన్న వారందరినీ ఎన్‌ఐఏ ప్రశ్నిస్తోంది. రిషి వీడియో బయటకు రావడంతో జిప్‌లైన్‌ నిర్వాహకుడిని మరోసారి విచారణకు పిలిచింది. ఈ ఘటనపై రిషి ఓ ఆంగ్ల వార్తాసంస్థతో మాట్లాడుతూ తాను జిప్‌లైన్‌ ఎక్కడానికి ముందే తన భార్య, కుమారుడు, మరో నలుగురు సురక్షితంగా దానిపై ప్రయాణించినట్లు వెల్లడించారు. తాను జిప్‌లైన్‌ ఎక్కిన తర్వాతే అతడు 'అల్లాహో అక్బర్‌' అనే సమయంలో కాల్పులు మొదలైనట్లు చెప్పారు. తాను ప్రయాణించడం మొదలుపెట్టిన 15-20 సెకన్ల తర్వాత అవి నిజమైన కాల్పులని తనకు అర్థమైందని రిషి చెప్పాడు. దీంతో జిప్‌లైన్‌ 15 అడుగుల ఎత్తు ఉండగానే దానిని ఆపేసి.. అక్కడినుంచి కిందకు దూకి భార్యాపిల్లలను తీసుకొని పరుగు తీసినట్లు పేర్కొన్నాడు. ఆ సమయంలో కుటుంబాన్ని కాపాడుకోవాలని మాత్రమే ఆలోచించినట్లు చెప్పాడు. తాము ఓ ప్రదేశంలో దాక్కొంటే.. దానికి ముందే ఉగ్రవాదులు కొందరిని మతం అడిగి మరీ కాల్చినట్లు వెల్లడించారని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనంలో పేర్కొంది. కాల్పులు ఆగిన కొద్దిసేపటికి ఆ మైదానం గేటు వద్దకు వెళ్లగా అప్పటికే స్థానికులు పారిపోయినట్లు పేర్కొన్నారు. 25 నిమిషాల్లో భద్రతా దళాలు అక్కడికి చేరుకొని వారికి రక్షణ కల్పించాయన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)