నడిరోడ్డుపై భర్త చెంపలు చెళ్లుమనిపించిన భార్య !

Telugu Lo Computer
0

జంటకు కొన్నేళ్ళ క్రితం పెళ్లయింది. పెళ్లయిన కొంత కాలం వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతి నుంచి ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. సంపాదన లేదంటూ భర్తతో భార్య తరచుగా గొడవపెట్టుకునేది. ఎంత గొడవపడ్డా అతడు మారకపోవటంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. ఓ రోజు డబ్బుల విషయంలో రోడ్డుపై భార్యాభర్తలకు గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భర్తపై భార్య రెచ్చిపోయింది. సంపాదన లేని నువ్వు అసలు మగాడివేనా అంటూ దూషించింది. అంతటితో ఆగకుండా అతడి చెంపలు వాయించింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా అతడి కాలర్ పట్టుకుని కొట్టింది. ఇక్కడ దారుణం ఏంటంటే ఆ వ్యక్తి ఉద్యోగానికి వెళ్లటం లేదంట. ఆమె డబ్బులు సంపాదిస్తే తిని తిరుగుతున్నాడట. ఉద్యోగంలో చేరమని, డబ్బులు సంపాదించమని ఎంత మొత్తుకున్నా వినకపోవటంతో ఆమె గొడవపెట్టుకుని నడిరోడ్డులో భర్తను కొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది భార్యకు సపోర్టుగా మాట్లాడుతుంటే, మరికొంతమంది భర్తను సపోర్టు చేస్తూ భార్యను తిడుతున్నారు. సంపాదన లేకపోతే మాత్రం భర్తను అలా నడిరోడ్డులో కొడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)