రేపటి నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్

Telugu Lo Computer
0


రేపటి నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభం కానున్నది. ఇప్పటికే కొన్ని టాప్ బ్రాండ్ మొబైల్ డీల్‌లను ఆవిష్కరించింది. ఈ జాబితాలో సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 15,ఐకూ నియో 10R, వన్‌ప్లస్ 13R కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లన్నింటిపై బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 15 పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది. అమెజాన్‌లో కేవలం రూ. 57,749 కు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.1-అంగుళాల డిస్‌ప్లే, యాపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్, 48MP ప్రైమరీ కెమెరా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G. ఇది అమెజాన్ సేల్ సమయంలో రూ.84,999కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది మాత్రమే కాదు, మీరు HDFC క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10శాతం బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సంవత్సరం జనవరిలో విడుదలైన వన్‌ప్లస్ 13ఆర్ కూడా ఈ సేల్‌లో చాలా చౌకగా దొరుకుతుంది. ఈ సేల్ సమయంలో ఈ ఫోన్ రూ.39,999కి అమ్మకానికి ఉంటుంది. ఇది కాకుండా ఫోన్‌తో పాటు రూ.3,999 విలువైన వన్‌ప్లస్ బడ్స్ 3 ఉచితంగా లభిస్తాయి. ఐకూ నియో 10R 5G, ఇది పాకెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ పై మొత్తం రూ.4,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది, ఆ తర్వాత దీని ధర రూ.13,249 మాత్రమే అవుతుంది. ఈ ఫోన్‌లో 6,400mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)