జమ్మూకశ్మీర్‌లో రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వరదలో చిక్కుకొని ముగ్గురు మరణించగా.. సుమారు 100మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. కొండ చరియలు విరిగి పడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయినట్లు చెబుతున్నారు. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతవరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఐదేళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమై గాలులు వీయడం ఇదే మొదటిసారని పేర్కొంది. ఘటనపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ..ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. రాంబన్‌లో కొండ చరియలు విరిగిపడడం వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందన్నారు. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.
జమ్మూ కశ్మీర్‌లో వర్ష భీభత్సానికి ముగ్గురు బలి !
April 20, 2025
0
Tags