ఉత్తర కొరియా సైన్యం తమ సరిహద్దుల్లోకి ప్రవేశించడంతో తాము హెచ్చరిక కాల్పులు జరిపినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. సరిహద్దులోని తూర్పు భూభాగంలో కిమ్ సైన్యం ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది. ఈ క్రమంలో ఉత్తర కొరియాకు హెచ్చరికలు చేయడంతోపాటు వార్నింగ్ షాట్‌లు ఇచ్చామని తెలిపింది. వార్నింగ్ షాట్స్‌తో 10 మంది కిమ్ సైనికులు తిరిగి వారి భూభాగంలోకి వెళ్లిపోయారని పేర్కొంది. ఉత్తర కొరియా కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించింది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఉన్న సైనికరహిత ప్రాంతంలో ఉల్లంఘనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. గత జూన్‌లో కూడా కిమ్ సైన్యం సరిహద్దు ఉల్లంఘనకు పాల్పడింది. అయితే శతృ సైన్యం ఉద్దేశపూర్వకంగా చొరబడలేదని దక్షిణ కొరియా అధికారులు ధ్రువీకరించడంతో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తలేదు.
ఉత్తరకొరియా సైన్యంపై దక్షిణ కొరియా వార్నింగ్ షాట్‌లు !
April 08, 2025
0
Tags