వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం !

Telugu Lo Computer
0


పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఈ కొత్త చట్టాన్ని కాంగ్రెస్, ఏఐఎంఐఎం, ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఈ కొత్త చట్టం వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం, ఆక్రమణలు ఆపడానికి ప్రయత్నిస్తుందని ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. ఈ చట్టం ముస్లింలకు ఎంత మాత్రం వ్యతిరేకం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుతో సహా ఆరు నెలల చర్చల తర్వాత చాలా సవరణలు అంగీకరించారు. అనంతరం రెండు సభల్లో ప్రవేశ పెట్టారు. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు ఓటు వేశారు. 95 మంది వ్యతిరేకించారు. లోక్సభలో 288 మంది సభ్యులు అనుకూలంగా ఉంటే వ్యతిరేకంగా 232 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ చట్టం రాజ్యాంగ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల పట్ల వివక్ష చపుతోందని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘనకు పాల్పడుతోందని పిటిషన్లలో పేర్కొన్నారు. కొత్త చట్టంపై ఆల్-ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మూడు రోజుల నుంచి నిరసనలు తెలుపుతోంది. దేశవ్యాప్తంగా నిరసనలను చేపట్టాలని పిలుపునిస్తోంది. ప్రభుత్వం మాత్రం ఈ చట్టం వల్ల ముస్లిం మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని వాదిస్తోంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత ఉంటుందని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)